హైదరాబాద్, ఆట ప్రతినిధి: కర్నిసింగ్ షూటింగ్ రేంజ్(న్యూఢిల్లీ) వేదికగా జరుగుతున్న జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో హైదరాబాదీ షూటర్ జెహ్రా ముఫ్పద్దల్ దేశ్వాలా ఐదు పతకాలతో దుమ్మురేపింది. మహిళల జూనియర్ వ్యక్తిగత ఈవెంట్తో పాటు టీమ్ఈవెంట్, మిక్స్డ్ ఈవెంట్లోనూ తనదైన ప్రతిభ చాటుతూ జెహ్రా పతకాలు కొల్లగొట్టింది.
మహిళల సీనియర్ విభాగంలోనూ ఈమె తొలి రజత పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం లయోలా కాలేజీలో చదువుతున్న జెహ్రా షూటింగ్లో నిలకడగా రాణిస్తున్నది.