Wrestling | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ వెల్లడించింది. అండర్-15, అండర్-20 వయో విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు హఫీజ్, మహమ్మద్ కరీం తెలిపారు.
హన్మకొండ వేదికగా జరగనున్న ఈ పోటీల్లో సత్తాచాటినవారు జాతీయ స్థాయికి ఎంపికవుతారని వెల్లడించారు.