ఢిల్లీ బోణీ కొట్టేనా!
ఢిల్లీ ఫ్రాంచైజీ | ఐపీఎల్ ప్రారంభం నుంచి టైటిల్ కోసం పరితపిస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ.. కొత్త కెప్టెన్ రాకతోనైనా జట్టు తలరాత

- తొలి టైటిల్ కోసం ఢిల్లీ నిరీక్షణ..
- ఉత్తమ ప్రదర్శన: 2020లో రన్నరప్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి టైటిల్ కోసం పరితపిస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ.. కొత్త కెప్టెన్ రాకతోనైనా జట్టు తలరాత మారుతుందేమోనని ఆశిస్తున్నది. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో అతడి స్థానంలో రిషబ్ పంత్‌కు జట్టు పగ్గాలు అప్పగించిన మేనేజ్మెంట్.. ఈసారైన తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తున్నది. గత సీజన్లో తొలిసారి టైటిల్ ఫైట్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి కూడా అలాంటి ప్రదర్శనే కనబర్చి కప్పు కొట్టాలని తహతహలాడుతున్నది. దేశీయ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం కాగా.. రబాడ, నోర్జే రూపంలో ఇద్దరు ప్రపంచ శ్రేణి పేసర్లు గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆసీస్ పర్యటనలో ఆకట్టుకోలేకపోయిన యువ ఓపెనర్ పృథ్వీ షా విజయ్ హజారే ట్రోఫీలో వరుస శతకాలతో తన సత్తా ఏంటో చాటుకోగా.. ఇటీవల ఇంగ్లండ్ వన్డే సిరీస్‌తో శిఖర్ ధావన్ టచ్‌లోకి వచ్చాడు. ఇక మునుపెన్నడూ లేని రీతిలో రిషబ్ పంత్ ఫుల్ ఫామ్‌లో ఉండటం ఢిల్లీకి అదనపు బలం. ఈ నెల 10న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ ఈ సీజన్‌ను ఆరంభించనుంది.
బలాలు
- మెరుగైన పేస్ అటాక్‌తో పాటు బలమైన బ్యాటింగ్ లైనప్.
- ధావన్, పృథ్వీషా, రహానే, పంత్, అక్షర్ రూపంలో టాపార్డర్‌లో దేశీయ ఆటగాళ్లు ఎక్కువ మంది అందుబాటులో ఉండటం.
- ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్ చేతికి జట్టు పగ్గాలు దక్కడం.
- ప్రపంచ అగ్రశ్రేణి పేసర్లు కగిసో రబాడ, నోర్జే పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండనుండటం.
బలహీనతలు
- ఆటగాళ్లకు సరైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేకపోవడం.
- గాయం కారణంగా సీజన్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్‌కు రిప్లేస్మెంట్ లేకపోవడం.
- దేశీయ పేసర్లు ఇషాంత్, ఉమేశ్‌కు టీ20ల్లోపేలవమైన రికార్డు
- పేరున్న దేశీ రిజర్వ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కొరత
భారత ఆటగాళ్లు: పంత్, ధావన్, పృథ్వీ షా, రహానే, అశ్విన్, అక్షర్, అమిత్ మిశ్రా, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, ఇషాంత్, అవేశ్ ఖాన్, ఉమేశ్ యాదవ్, రిపల్ పటేల్, విష్ణు వినోద్, లుక్మన్, సిద్ధార్థ్.
విదేశీ ఆటగాళ్లు: హెట్‌మైర్, స్టొయినిస్, వోక్స్, రబాడ, నోర్జే, స్మిత్, టామ్ కరన్, సామ్ బిల్లింగ్స్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

