Asia Cup 2023 | అరంగేట్రం వన్డేలో డకౌట్.. నాలుగో బంగ్లా క్రికెటర్‌గా రికార్డు
Asia Cup 2023 : ఆసియా కప్‌తో జట్టులోకి వచ్చిన బంగ్లాదేశ్(Bangladesh) యువ ఓపెనర్ తంజిద్ హసన్(Tanzid Hasan) చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అరంగేట్రం వన్డే(Debut ODI)లోనే డకౌట్ అయ్యాడు. దాంతో, ఆడిన తొలి వన్డేలో సున్నాకే వెనుదిరిగిన నాలుగో బంగ్లా క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. పల్లెకల్ స్టేడియంలో ఈ రోజు శ్రీలంకతో....
Asia Cup 2023 : ఆసియా కప్‌తో జట్టులోకి వచ్చిన బంగ్లాదేశ్(Bangladesh) యువ ఓపెనర్ తంజిద్ హసన్(Tanzid Hasan) చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అరంగేట్రం వన్డే(Debut ODI)లోనే డకౌట్ అయ్యాడు. దాంతో, ఆడిన తొలి వన్డేలో సున్నాకే వెనుదిరిగిన నాలుగో బంగ్లా క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. పల్లెకల్ స్టేడియంలో ఈ రోజు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తంజిద్ ఓపెనర్‌గా వచ్చాడు. రెండు బంతులు ఎదుర్కొన్న అతను మహీశ్ థీక్షణ(Maheesh Theekshana) బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. దాంతో, జాతీయ జట్టుకు ఆడాలన్నకల నిజమైన సంతోషం క్షణాల్లో ఆవిరైనట్లయింది.
హసన్ కంటే ముందు ముగ్గురు బంగ్లా ఆటగాళ్లు తొలి మ్యాచ్‌లోనే డకౌట్‌గా ఔటయ్యారు. వాళ్లు ఎవరంటే..? నురుల్ అబెదిన్(Nurul Abedin) 1986లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ పాకిస్థాన్‌పై ఆడాడ. అయితే.. అనూహ్యంగా సున్నాకే వెనుదిరిగాడు. 1988లో భారత్‌పై అరంగేట్రం చేసిన హరునుర్ రషీద్(Harunur Rashid) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత 2002లో రఫీకుల్ ఇస్లాం(Rafiqul Islam) దక్షిణాఫ్రికాపై సున్నాకే ఔటయ్యాడు.
హసన్ వికెట్ కోసం అప్పీల్ చేస్తున్న లంక ఆటగాళ్లు

ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హసన్(Shakib Al Hasan) బ్యాటింగ్ తీసుకున్నాడు. మొహమ్మద్ నయూం, తంజిద్ హసన్(0) ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే.. రెండో ఓవర్లోనే తంజిద్‌ను థీక్షణ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దాంతో, బంగ్లా 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

