హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ అంతర్‌జిల్లాల, రాష్ట్ర టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో అమన్ బలుగు, గార్లపాటి ప్రణీత విజేతలుగా నిలిచారు. పురుషుల సూపర్ లీగ్ విభాగంలో అమన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఒక మ్యాచ్‌లోనే ఓడిన అమన్‌కు…వరుణ్ శంకర్ నుంచి వాకోవర్ లభించింది. మహిళల కేటగిరీలో ప్రణీత ఒకే ఒక ఓటమితో ట్రోఫీని ఒడిసిపట్టుకుంది.