Ab devilliers | పొట్టి ప్రపంచకప్ విజేత టీమిండియానే : ఏబీ డివీలియర్స్
భారత జట్టు టీ 20 వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుంది : ఏబీ డివిలియర్స్
డివీలియర్స్ : పొట్టి ప్రపంచకప్ విజేతగా ఈ ఏడాది భారత జట్టు నిలుస్తుందని జోస్యం చెప్పాడు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివీలియర్స్. నవంబర్ 13వ తేదీన మెల్బోర్న్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడే అవకాశం ఉందని ట్విట్టర్లో చెప్పాడు. ‘టీమిండియాలో చాలా ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. అందరూ చక్కగా ఆడుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ ఈ టోర్నీలో ఆశించినన్ని పరుగులు చేయలేదు. అయితే, కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ అదరగొడతాడు’ అని అన్నాడు డివీలియర్స్.
గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్, గ్రూప్ 2 నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు సెమీస్‌కి చేరాయి. నవంబర్ 12వ తేదీన న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు మొదటి సెమీఫైనల్లో తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ ఫైనల్ బెర్త్ కోసం పోటీపడనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు కచ్చితంగా సెమీఫైనల్ చేరతాయి అనుకున్నారంతా. కానీ, నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికా జట్టు ఇంటిదారి పట్టింది. శ్రీలంకను ఇంగ్లాండ్ చిత్తు చేయడంతో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
#WATCH | I think India will play New Zealand in the finals and India will win the World Cup. Suryakumar Yadav and Virat Kohli are in great form. The whole team of India is very talented: Former South African cricketer AB de Villiers pic.twitter.com/83tRjI0Fl2
— ANI (@ANI) November 8, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shiraz Mehdi | చిన్న సినిమాలకు థియేటర్ల కొరత.. ఫిలిం ఛాంబర్ తీరుపై దర్శకుడు షిరాజ్ మెహదీ ఫైర్!
ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
CM Revant vs Farmers | సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంపై పాడి రైతుల ఆగ్రహం.. Video
Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

