దుబాయ్: ఒక్కోసారి చుట్టూ ఉన్న పరిస్థితులు మన కళ్లను మాయ చేస్తుంటాయి. ఒక్కోసారి మనకు ఆ పనిలో ఎంత అనుభవమున్నా పొరపాట్లు చేసేస్తుంటాం. శనివారం జరిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్‌లో ఇలాంటి ఒక ఘటనే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ కామెంటరీ చెప్తున్నాడు.
అతనితోపాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ కూడా ఉన్నాడు. మైదానంలో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ విజృంభిస్తున్నాడు. ఈ క్రమంలో మిచెల్ స్టార్క్ వేసిన ఒక బంతికి భారీ సిక్స్ బాదాడు. అదే సమయంలో మ్యాచ్ కెమెరా ఆ బంతిపై ఫోకస్ అయింది. ఆ బంతి వెళ్లి స్టాండ్స్‌లో పడిన తర్వాత కెమెరా దానిపైనే కాసేపు నిలిచింది.
ఈ సమయంలోనే ఆ బంతిని చూసి చందమామ అనుకున్నాడు వాట్సన్. ‘మనం ఉండే భూమి అందం’ అంటూ మెచ్చుకున్నాడు. పక్కనే ఉన్న నాసిర్ హుస్సేన్ ‘అది స్టార్క్ బౌలింగ్‌లో బట్లర్ కొట్టిన సిక్స్’ అని చెప్పడంతో ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. ఈ సంభాషణ విన్న టీవీ ప్రేక్షకులు కూడా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బట్లర్ కొట్టిన సిక్సర్..
వాట్సన్ కామెంటరీ ఇది!