T20 World Cup | హ్యాట్రిక్ వికెట్లు తీసిన శ్రీలంక స్పిన్నర్ హసరంగ
T20 World Cup | శ్రీలంక రైజింగ్ స్టార్ వాసిందు హసరంగ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు.

షార్జా: శ్రీలంక రైజింగ్ స్టార్ వాసిందు హసరంగ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎయిడెన్ మార్క్రమ్, టెంబా బవుమా, డ్వేన్ ప్రిటోరియస్‌ను వరుస బంతుల్లో అవుట్ చేసిన హసరంగ ఈ రికార్డు సాధించాడు.
అతని కన్నా ముందు ఇలా టీ20 ప్రపంచకప్‌లలో హ్యాట్రిక్ సాధించిన ఇద్దరూ కూడా పేసర్లే కావడం గమనార్హం. తొలి టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా లెజెండ్ బ్రెట్‌లీ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఆటగాడు కర్టిస్ కాంఫర్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. ఇప్పుడు హసరంగ మరో హ్యాట్రిక్ నమోదు చేశాడు.
అంటే ఈ ప్రపంచకప్‌లోనే రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయన్నమాట. అంతేకాదు ఆసీస్ పేసర్ బ్రెట్‌లీ వన్డే ప్రపంచకప్‌లో కూడా హ్యాట్రిక్ తీశాడు. 2003 ప్రపంచకప్‌లో కెన్యాపై ఈ ఫీట్ సాధించాడు. ఇలా టీ20, వన్డే ప్రపంచకప్‌లు రెండింట్లోనూ హ్యాట్రిక్‌లు రికార్డు చేసిన ఏకైక బౌలర్ అతనే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

