యూజీన్: సిడ్నీ మెక్లాగిన్ చరిత్ర సృష్టించింది. తన రికార్డును మళ్లీ తానే బద్దలు కొట్టింది. అమెరికాలోని ఓరేగాన్లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆ దేశ అథ్లెట్ సిడ్నీ మెక్లాగిన్ 400 మీటర్ల హార్డిల్స్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. 22 ఏళ్ల సిడ్నీ కేవలం 50.68 సెకన్లలో 400 మీటర్ల హార్డిల్స్‌ను పూర్తి చేసి గోల్డ్ మెడల్ గెలుచుకున్నది. జూన్‌లో క్రియేట్ చేసిన 51.41 సెకన్ల రికార్డును ఆమె మళ్లీ బ్రేక్ చేసింది. ఇది నమ్మలేకపోతున్నానని, మరింత వేగంగా మారిపోతున్నానని ఆమె అన్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన ఫెమ్కీ బోల్ బ్రాంజ్ మెడల్ గెలువగా, అమెరికాకే చెందిన దలీలా మొహమ్మద్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.