స్విస్‌దే ఆఖరి బెర్తు
సాకర్ ప్రపంచకప్‌లో అంచనాలే లేని దేశంగా బరిలోకి దిగి ఒక్కో మెట్టు ఎక్కుతున్న స్విట్జర్లాండ్ ఏడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ క్వారర్ఫైనల్కు అర్హత సాధించింది.
- 72 ఏండ్ల తర్వాత క్వార్టర్స్ చేరిన స్విట్జర్లాండ్..
- షూటౌట్లో ఓడిన కొలంబియా
వాన్కూవర్ (కెనడా): సాకర్ ప్రపంచకప్‌లో అంచనాలే లేని దేశంగా బరిలోకి దిగి ఒక్కో మెట్టు ఎక్కుతున్న స్విట్జర్లాండ్ ఏడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ క్వారర్ఫైనల్కు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్.. పెనాల్టీ షూటౌట్లో 4-3తో కొలంబియాను ఓడించి లాస్ట్-8కు చేరుకుంది. నిర్ణీత సమయంతో పాటు ఎక్స్ట్రా టైమ్‌లోనూ ఇరుజట్లు గోల్ కొట్టడంలో విఫలమవగా పెనాల్టీ అనివార్యమైన పోరులో స్విట్జర్లాండ్ 4 గోల్స్‌తో ప్రత్యర్థిని చిత్తుచేసి 1954 తర్వాత తొలిసారి ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు ప్రవేశించింది. క్వార్టర్స్‌లో ఆ జట్టు ఈనెల 12న డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో తలపడనుంది. స్విట్జర్లాండ్, కొలంబియా మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌లో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లకు శుభం కార్డు పడగా శుక్రవారం నుంచి క్వార్టర్స్ పోరు ఆరంభం అవనుంది.
షూటౌట్లో తేలిన ఫలితం
మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించినా ఒక్కరూ గోల్ కొట్టలేకపోయారు. బంతిపై రెండు జట్లూ సమంగా ఆధిపత్యం ప్రదర్శించగా స్విస్పైకి కొలంబియా ఏకంగా 15 సార్లు గోల్ కొట్టేందుకు యత్నించినా అందులో ఒక్కసారీ సక్సెస్ కాలేకపోయింది. స్విట్జర్లాండ్ సైతం ఏడుసార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడికి దిగినా వారిదీ అదే కథ. రెండు జట్ల డిఫెండర్లతో పాటు గోల్‌కీపర్లు ప్రత్యర్థి ఆటగాళ్లకు అడ్డుగోడలా నిలబడ్డారు. గోల్ చేసేందుకు 21వ నిమిషంతో పాటు ఎక్స్ట్రా టైమ్ (116వ) లోనూ కొలంబియా మంచి అవకాశాలు సృష్టించుకున్నా వాటినీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. స్విట్జర్లాండ్ సైతం 30వ, 52వ నిమిషాల్లో వచ్చిన చాన్స్‌లను మిస్ చేసుకుంది. షూటౌట్ అనివార్యమైన వేళ స్విస్‌కు గ్రానిట్ జాకా, జికె అమ్దౌని, సెడ్రిక్ ఇటెన్, రూబెన్ వర్గాస్ గోల్స్ చేయగా.. కొలంబియా నుంచి జువాన్ క్వింటెరొ, జమింటన్ కాంపాజ్, లుయిస్ దియాజ్ గోల్స్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

