Suryakumar Yadav | అరుదైన ఫీట్‌ని సాధించిన సూర్యకుమార్ యాదవ్..!
Suryakumar Yadav | ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ముంబయిలోని వాఖండే స్టేడియంలో సోమవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఘనత విజయం సాధించిన విషయం తెలిసిందే.
Suryakumar Yadav | ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ముంబయిలోని వాఖండే స్టేడియంలో సోమవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఘనత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో గెలిచి.. ఈ సీజన్లో ముంబయి తొలి విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్‌కు ఇది రెండో ఓటమి కాగా.. పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆకట్టుకున్నారు. తొమ్మిది బంతుల్లో మూడు బౌండరీలు, రెండు సిక్సర్ల సహాయంతో 27 పరుగులు చేశాడు.
దాంతో టీ20 క్రికెట్లో అరుదైన ఫీట్‌ని అందుకున్నాడు. టీ20 8వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. టీ20ల్లో సూర్యకుమార్ 8వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్స్ సరసన నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా ముందున్నారు. 288వ టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ ఈ ఘనతను సాధించాడు. ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో విరాట్ ముందున్నాడు. విరాట్ 12,976 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ (11,851), శిఖర్ ధావన్ (9,797), సురేశ్ రైనా 8,654 పరుగులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

