ICC rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్‌టెన్‌లోకి సూర్యకుమార్
ICC rankings | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) టీ20 ర్యాంకింగ్స్ (T20 rankings) లో భారత క్రికెట్ జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) టాప్ టెన్ (Top 10) బ్యాట్స్‌మెన్ జాబితాలో తిరిగి చోటు దక్కించుకున్నాడు.
ICC rankings : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) టీ20 ర్యాంకింగ్స్ (T20 rankings) లో భారత క్రికెట్ జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) టాప్ టెన్ (Top 10) బ్యాట్స్‌మెన్ జాబితాలో తిరిగి చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న సూర్యకుమార్.. ఐదు స్థానాలు ఎగబాకి 717 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానానికి ఎగబాకాడు.
పొట్టి క్రికెట్లో పరుగులు సాధించడానికి ఇబ్బందిపడుతున్న సూర్యకుమార్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 82, మూడో టీ20లో 57 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా మూడో టీ20లో 68 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 14 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు.
నాగపూర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 35 బంతుల్లో 84 పరుగులు చేశాడు. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 929 రేటింగ్ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెటర్ ఫిల్ సాల్ట్ (849), తిలక్ వర్మ (781) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకులో నిలిచాడు.
అదేవిధంగా మూడో టీ20లో మూడు వికెట్లు తీసి రాణించాడు. ఆల్ రౌండర్ల విభాగంలో హార్ధిక్ పాండ్య ఒక స్థానం ఎగబాకి మూడో ర్యాంకుకు, శివమ్ దుబే ఐదు స్థానాలు ఎగబాకి పదకొండవ ర్యాంకుకు చేరుకున్నారు. అక్షర్ పటేల్ 3 స్థానాలు పడిపోయి 13వ ర్యాంకులో ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

