IPL 2021 | గంటకు 151.03 కిలోమీటర్లు.. తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ బౌలర్ రికార్డు.. వీడియో
ఐపీఎల్( IPL 2021 ) అరంగేట్ర మ్యాచ్‌లోనే తన స్పీడ్‌తో అదరగొట్టాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్.

దుబాయ్: ఐపీఎల్( IPL 2021 ) అరంగేట్ర మ్యాచ్‌లోనే తన స్పీడ్‌తో అదరగొట్టాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. తన తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన ఇండియన్ పేస్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అతడు ఏకంగా గంటకు 151.03 కిలోమీటర్ల వేగంతో విసిరిన ఓ బంతి ఆశ్చర్యపరిచింది. ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్ ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన డెలివరీ కేకేఆర్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ పేరిట ఉంది. అతడు గంటకు 152.75 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు.
ఇప్పటి వరకూ ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన ఇండియన్ బౌలర్‌గా మహ్మద్ సిరాజ్ (గంటకు 145.97 కి.మీ.) ఉన్నాడు. ఇప్పుడా రికార్డు బద్ధలైంది. నిజానికి కరోనా బారిన పడిన నటరాజన్ స్థానంలో తాత్కాలికంగా ఉమ్రాన్ మాలిక్‌ను సన్‌రైజర్స్ తీసుకుంది. అతడు చాలాకాలంగా నెట్ బౌలర్‌గా ఉన్నాడు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్.. ఆ టీమ్ తరఫున ఒక టీ20, లిస్ట్ ఎ మ్యాచ్ ఆడి నాలుగు వికెట్లు తీశాడు. ఇప్పుడు ఐపీఎల్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే నిలకడగా 141 కి.మీ. తగ్గని వేగంతో బంతులు విసిరి ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చిన ఉమ్రాన్.. వికెట్ తీయలేకపోయాడు.
Debutant Umran malik click 150 kph pic.twitter.com/uRA4mwLuxx
— Salman Yassa (@sal_yassa) October 3, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

