Sunil Gavaskar | వరల్డ్ కప్ టీమ్‌లో ఎవరిని తీసుకోవాలి..? అని వాళ్లను అడగకండి.. భారత మీడియాకు గవాస్కర్ సూచన
వరల్డ్ కప్ జట్టులో ఎవరిని తీసుకోవాలి? అని విదేశీ కామెంటేటర్లను అడకండని భారత మీడియాకు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. వాళ్లు చెప్పిన ఆటగాళ్లు టీమిండియాకు అవసరం లేకపోవచ్చు అని లిటిల్ మాస్టర్ అన్నాడు
Sunil Gavaskar : వరల్డ్ కప్ జట్టులో ఎవరిని తీసుకోవాలి? అని విదేశీ కామెంటేటర్లను అడకండి అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ భారత మీడియాకు సూచించాడు. విదేశాలకు చెందిన కామెంటేటర్లు చెప్పిన పేర్లు భారత జట్టులో ఉండకపోవచ్చు అని అతను అన్నాడు. ‘వరల్డ్ కప్ జట్టులో ఎవరు ఉంటారని ఫారెన్ కామెంటేటర్స్ను అడగకండి. ఎందుకంటే.. వాళ్లు చెప్పిన ఆటగాళ్లు టీమిండియాకు అవసరం లేకపోవచ్చు. 2019 వరల్డ్ కప్ సమయంలోనూ ఇలానే జరిగింది. ఐపీఎల్ సందర్భంగా వాళ్లు ఒక యువ ఆటగాడి పేరు చెప్పారు. వాళ్లు చెప్పినట్టే అతడు భారత జట్టుకి ఎంపికయ్యాడు. అతను అద్భుతమైన ప్లేయర్. కానీ, తుది జట్టులో చోటు దక్కలేదు’ అని గవాస్కర్ తెలిపాడు.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌కి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. దాంతో ఇండియా ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. అందుకని నెల క్రితం 20 మంది ఆటగాళ్లను వరల్డ్ కప్ కోసం బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. అయితే.. పేర్లు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. దాంతో, అప్పటి నుంచి ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారు? అని అందరిలో ఆసక్తి మొదలైంది. కామెంటేటర్ హర్ష భోగ్లే షార్ట్ లిస్ట్‌లోని 20 మందిని ఊహిస్తూ పేర్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

