Sunil Gavaskar | రాహుల్‌కు మరో అవకాశం ఇవ్వాలి.. ఎందుకంటే..? : గవాస్కర్
ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వెనకేసుకొచ్చాడు. టెస్టుల్లో అతడికి మరో అవకాశం ఇవ్వాలని అన్నాడు. మళ్లీ రాహుల్ విఫలమైతే.. శుభ్‌మన్ గిల్ ఉన్నాడని తెలిపాడు.
Sunil Gavaskar : ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వెనకేసుకొచ్చాడు. టెస్టుల్లో అతడికి మరో అవకాశం ఇవ్వాలని గవాస్కర్ అన్నాడు. మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ రాహుల్‌పై చేసిన కామెంట్లకు లిటిల్ మాస్టర్ స్పందించాడు. ‘రాహుల్ టెస్టుల్లో తరచూ విఫలం అవుతున్నాడు. అతను నిలకడలేమిని కొనసాగిస్తున్నాడు. ప్రదర్శనను బట్టి కాకుండా పాపులారిటినీ బట్టి అతను జట్టులో ఉన్నాడు’ అని వెంకటేష్ ప్రసాద్ రాహుల్‌పై సంచలన కామెంట్లు చేశాడు. అయితే… ఈ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలతో గవాస్కర్ ఏకీభవించలేదు.
‘రాహుల్‌కు మరో అవకాశం ఇవ్వాలి. గత రెండేళ్లుగా అతను వన్డేలు, టీ20ల్లో మెరుగ్గా ఆడుతున్నాడు. ఢిల్లీ టెస్టులో అతను కచ్చితంగా పరుగులు చేస్తాడని భవిస్తున్నా. ఒకవేళ మళ్లీ రాహుల్ విఫలమైతే.. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ఎలాగూ ఉండనే ఉన్నాడు’ అని గవాస్కర్ అన్నాడు.
సూపర్ ఫామ్‌లో గిల్
నాగ్‌పూర్‌లో జరిగిన బోర్డర్ – గవాస్కర్ తొలి టెస్టులో రాహుల్ 20 రన్స్ మాత్రమే చేశాడు. 70 బంతులు ఎదుర్కొన్న అతను రోహిత్‌లా దూకుడుగా ఆడలేకపోయాడు. రాహుల్ కీలకమైన మ్యాచ్‌లో విఫలం కావడంతో ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని అంటున్నారంతా. స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లో ఈ యువ ఓపెనర్ దుమ్ము రేపాడు. శ్రీలంకపై మూడో వన్డేలో డబుల్ సెంచరీ బాదాడు. కివీస్‌పై మూడో టీ20లో సెంచరీ కొట్టాడు. దాంతో, మూడు ఫార్మాట్లలో శతకం సాధించిన అతి పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా గిల్ గుర్తింపు సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

