Ranchi ODI | సుందర్ ఔట్.. శతకానికి చేరువైన కోహ్లీ..!
Ranchi ODI : రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న వాషింగ్టన్ సుందర్(13) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. బార్టిమన్ ఓవర్లో షాట్ ఆడిన సుందర్ కార్బిన్ బాస్చ్ చేతికి చిక్కాడు.
Ranchi ODI : రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న వాషింగ్టన్ సుందర్(13) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. బార్టిమన్ ఓవర్లో షాట్ ఆడిన సుందర్ కార్బిన్ బాస్చ్ చేతికి చిక్కాడు. దాంతో పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ పడింది. మరో ఎండ్‌లో దంచికొడుతున్న విరాట్ కోహ్లీ(90 నాటౌట్) శతకానికి చేరువయ్యాడు. ప్రస్తుతం కోహ్లీ జతగా కెప్టెన్ కేఎల్ రాహుల్(5 నాటౌట్) ఆడుతున్నాడు. 32 ఓవర్లకకు స్కోర్.. 208/4.
మూడు వన్డేల సిరీస్‌లో మొదటిదైన రాంచీ వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. టాస్ ఓడిన టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్ యశస్వీ జైస్వాల్(18) వికెట్ కోల్పోయినా.. రోహిత్ శర్మ,(57) విరాట్ కోహ్లీ(90 నాటౌట్)లు దంచేశారు. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయిన రోకో స్కోర్ బోర్డును ఉరికించారు. సిక్సర్‌తో కోహ్లీ 75వ అర్ధ శతకం సాధించాడు. ఆ కాసేపటికే హిట్‌మ్యాన్ సైతం హాఫ్ సెంచరీ అందుకున్నాడు. చెలరేగి ఆడుతున్న ఈ ద్వయాన్ని మార్కో జాన్సెన్ విడదీసి సఫారీలకు బ్రేకిచ్చాడు.
Rohit Sharma falls after his third consecutive fifty-plus score 💪 pic.twitter.com/52GZPWsSGX
— ESPNcricinfo (@ESPNcricinfo) November 30, 2025
ఆ తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (8) క్రీజులో కుదురుకొనే లోపే డెవాల్డ్ బ్రెవిస్ స్టన్నింగ్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. దాంతో.. 183 వద్ద టీమిండియా మూడో వికెట్ పడింది. అనూహ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన వాషింగ్టన్ సుందర్(13) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. బార్ట్‌మన్ ఓవర్లో అతడు బాస్చ్ చేతికి చిక్కడంతో నాలుగో వికెట్ కోల్పోయింది భారత్. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడడంతో స్కోర్ నెమ్మదించింది. రికార్డు శతకం బాదేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

