GT vs CSK : పంతొమ్మిదో సీజన్లో గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ ఓటమి తప్పించుకుంది. చెపాక్ స్టేడియంలో రబడ (3-25) విజృంభణతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ కొట్టనివ్వని గుజరాత్.. మోస్తరు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(87), శుభ్‌మన్ గిల్(33) శుభారంభంతో విజయానికి బాటలు వేయగా.. జోస్ బట్లర్(39 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో 8 వికెట్ల తేడాతో గెలిచిన గుజరాత్ ఈ ఎడిషన్‌లో నాలుగో విజయం నమోదు చేసింది.
మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. ముంబై, ఆర్సీబీ చేతుల్లో చిత్తైన గుజరాత్ చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను దారుణంగా ఓడించింది. తొలుత సీఎస్కేను 158కే కట్టడి చేసిన గుజరాత్.. మోస్తరు ఛేదనను గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్(87), శుభ్‌మన్ గిల్(౩౩)లు దూకుడగా ఆరంభించారు. వీరిద్దరి జోరుతో గుజరాత్ పవర్ ప్లేలో 55 రన్స్ కొట్టింది. కానీ నూర్ అహ్మద్ ఓవర్లో గిల్‌ను శాంసన్ స్టంపౌట్ చేయగా తొలి వికెట్ పడింది. అనంతరం జోస్ బట్లర్(39 నాటౌట్), సుదర్శన్ జోరు కొనసాగించారు.
It is Sai Sudharsan again 👏
A steady 5⃣0⃣ to follow up a hundred, the #GT opener steering the side 👌
Updates ▶️ https://t.co/zJBovAaCoM #TATAIPL | #KhelBindaas | #CSKvGT pic.twitter.com/5AN27dvhzW
— IndianPremierLeague (@IPL) April 26, 2026
లోకల్ బాయ్ సుదర్శన్ తన స్టయిల్ ఆటతో అర్ధ శతకం బాదేసి గుజరాత్ గెలుపు ఖాయం చేశాడు. బట్లర్ అండగా తమిళ తంబీ చెలరేగడంతో చెన్నై బౌలర్లు వికెట్ తీయలేక అపసోపాలు పడ్డారు. నూర్ ఓవర్లో స్ట్రెయిట్ సిక్సర్ బాదిన సుదర్శన్ .. గుర్జప్నీత్ వేసిన 16వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. విజయానికి ఐదు పరుగుల దూరంలో అకీలో హొసేన్ ఓవర్లో సుదర్శన్ ఔటైనా.. సిక్సర్‌తో లాంఛనం ముగించిన బట్లర్ 8 వికెట్ల విజయాన్ని కట్టబెట్టాడు.
పంతొమ్మిదో సీజన్లో విఫలమవుతున్న రుతురాజ్ గైక్వాడ్(74 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆడుకున్నాడు. చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ పేసర్ రబడ(3-25) ధాటికి పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిన చెన్నైని గైక్వాడ్ గట్టెక్కించాడు.

రబడ, సిరాజ్ ధాటికి 37 కే నాలుగు వికెట్లు పడినా.. శివం దూబే(22), కార్తిక్ శర్మ(15), జేమీ ఓవర్టన్(18)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఆఖరి ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లతో సీఎస్కేకు పోరాడగలిగే స్కోరందించాడు గైక్వాడ్.