40 నిమిషాల్లో 4 గోల్స్
ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనాల పర్వం కొనసాగుతున్నది. టైటిల్ ఫేవరెట్లు అనుకున్న జట్లు అభిమానులను తీవ్ర నిరాశలో ముంచుతూ అనూహ్య పరాజయాలతో నిష్క్రమిస్తున్నాయి.
- క్వార్టర్స్‌లో బ్రెజిల్
- కొరియాపై ఘన విజయం
- మెరిసిన నెయ్మర్ జూనియర్
- మొరాకో చేతిలో స్పెయిన్ అనూహ్య పరాజయం
- ఫిఫా ప్రపంచకప్ టోర్నీ
ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనాల పర్వం కొనసాగుతున్నది. టైటిల్ ఫేవరెట్లు అనుకున్న జట్లు అభిమానులను తీవ్ర నిరాశలో ముంచుతూ అనూహ్య పరాజయాలతో నిష్క్రమిస్తున్నాయి. ఓవైపు కొరియాపై ఘన విజయంతో బ్రెజిల్ క్వార్టర్స్‌లోకి దూసుకెళితే..స్పెయిన్‌కు మొరాకో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. నెయ్మర్ రాకతో కొత్త జోష్‌తో బరిలోకి దిగిన సాంబా టీమ్ కొరియాపై నాలుగు గోల్స్‌తో విరుచుకుపడితే..తమ కంటే తక్కువ ర్యాంక్‌లో ఉన్న మొరాకో డిఫెన్స్‌ను స్పెయిన్ నిలువరించలేకపోయింది. పెనాల్టీ షూటౌట్లో స్పెయిన్‌ను మొరాకో నాకౌట్ చేసింది.
దోహా: ఫిఫా ప్రపంచకప్ అభిమానులను కట్టిపడేస్తున్నది. ప్రతీ మ్యాచ్ ఫ్యాన్స్‌కు కావాల్సినంత మజాను అందిస్తున్నది. ఊహించని మలపులతో మెగాటోర్నీ థ్రిల్లర్‌ను తలపిస్తున్నది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా భావించిన బ్రెజిల్ తమదైన శైలిలో ముందంజ వేస్తే పడుతూ లేస్తూ సాగిన స్పెయిన్ నిరాశజనక ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో బ్రెజిల్ 4-1తో కొరియాపై ఘన విజయం సాధించింది. వరుసగా ఎనిమిదో సారి ప్రపంచకప్ క్వార్టర్స్‌కు అర్హత సాధించిన బ్రెజిల్ తరఫున వినిసియస్(7ని), నెయ్మర్(13ని), రిచర్లీసన్(29ని), లుకాస్ పకెటా(36ని) గోల్స్ చేయగా, పైక్ షెంగ్హు(76ని) కొరియాకు ఏకైక గోల్ అందించాడు. మ్యాచ్ ఆద్యంతం తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన బ్రెజిల్..కొరియా గోల్‌పోస్ట్ లక్ష్యంగా మెరుపు దాడులకు పాల్పడింది.
గాయం నుంచి పూర్తిగా కోలుకుని జట్టులోకి వచ్చిన స్టార్ స్ట్రైకర్ నెయమర్ జట్టును ముందుండి నడిపించాడు. ఈ క్రమంలో మ్యాచ్ 13వ నిమిషంలో దక్కిన పెనాల్టీని గోల్‌గా మలిచిన నెయ్మర్(76).. దిగ్గజ పీలే(77) తర్వాత బ్రెజిల్‌కు అత్యధిక గోల్స్ అందించిన ప్లేయర్‌గా నిలిచాడు. దీనికి తోడు వరుస ప్రపంచకప్‌లలో గోల్స్ చేసిన పీలే, రొనాల్డో సరసన నెయ్మర్ నిలిచాడు. మరోవైపు బ్రెజిల్ ఆశాకిరణంగా భావిస్తున్న రిచర్లీసన్ కండ్లు చెదిరే గోల్ కొట్టి ‘పీజియన్’ డ్యాన్స్‌తో అభిమానులను అలరించాడు. మ్యాచ్‌లో గోల్ చేసిన ప్రతీసారి బ్రెజిల్ ప్లేయర్లు సూపర్ డ్యాన్స్‌లతో సంబురాలు చేసుకున్నారు. క్వార్టర్స్‌లో క్రొయేషియాతో బ్రెజిల్ తలపడుతుంది.
స్పెయిన్ నాకౌట్
మెగాటోర్నీ నుంచి స్పెయిన్ నిష్క్రమించింది. మ్యాచ్ నిర్ణీత సమయంలో ఎలాంటి గోల్ కాకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు జరిగిన పెనాల్టీ షూటౌట్లో స్పెయిన్ 0-3తో మొరాకో చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొంది. స్పెయిన్ తరఫున ఏ ఒక్కరూ గోల్ చేయకపోగా, మొరాకో మూడు గోల్స్‌తో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

