Steve Smith : ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్(Steve Smith) మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన మూడో ఆస్ట్రేలియా క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. స్లిప్‌లో మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకునే అతను 157 క్యాచ్‌లు పట్టాడు. దాంతో అలెన్ బోర్డర్ (156) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఫీట్‌ను అతను ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) భారత జట్టుపై సాధించాడు. ఐదో రోజు తొలి సెషన్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆడిన బంతిని స్మిత్ గాల్లోకి ఎగురుతూ ఒడిసిపట్టుకున్నాడు.
దాంతో, ఆసీస్ తరఫున ఎక్కువ క్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్న మార్క్ టేలర్(157) రికార్డు సమం చేశాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ 196 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. మాజీ కెప్టెన్ మార్క్ వా(181) రెండో స్థానంలో నిలిచాడు.
SCREAMER! 🤩
A massive moment in the game! ☝
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/GsHFfOGCme
— ICC (@ICC) June 11, 2023
బిగ్ బాష్ లీగ్(Big Bash League)లో వరుస సెంచరీలతో సత్తా చాటిన స్మిత్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో చెలరేగాడు. కీలక వికెట్లు పడ్డాక క్రీజులోకి వచ్చిన అతను సెంచరీ(121)తో జట్టును ఆదుకున్నాడు. ట్రావిస్ హెడ్(163)తో కలిసి నాలుగో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నిర్మించాడు. దాంతో, తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 469 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్‌ను 296కే ఆలౌట్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ(66 నాటౌట్), మిచెల్ స్టార్క్(41) 93 రన్స్ జోడించడంతో ఆసీస్ 270 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత్ ముందు 444 టార్గెట్ ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న కోహ్లీ(49), జడేజా(0)లను తొలి సెషన్లో వరుస బంతుల్లో బోలాండ్ పెవిలియన్ పంపాడు. అజింక్యా రహానే(41), శ్రీకర్ భరత్(15) ఓటమి తప్పించేందుకు పోరాడుతున్నారు.