ఫైనల్ మ్యాచ్‌కు 5 నిమిషాల ముందు మా నాన్నమ్మ చనిపోయిందని తెలిసింది!

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పోరాడి ఓడిన గ్రీకు వీరుడు స్టెఫానోస్ సిట్సిపాస్ మ్యాచ్‌కు ముందు జరిగిన విషాదాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తనకెంతో ఇష్టమైన నాన్నమ్మ చనిపోయినట్లు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ఐదు నిమిషాల ముందే తనకు తెలిసిందని అతడు చెప్పాడు. ఆ బాధలోనూ మ్యాచ్ బరిలో దిగిన సిట్సిపాస్.. తొలి రెండు సెట్లు గెలిచి పెను సంచలనం సృష్టించేలా కనిపించాడు. కానీ వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జోకవిచ్ అనూహ్యంగా పుంజుకోవడంతో సిట్సిపాస్‌కు ఓటమి తప్పలేదు.
తన నాన్నమ్మలాంటి వ్యక్తిని తాను ఇప్పటి వరకూ చూడలేదని ఈ సందర్భంగా అతడు ఇన్‌స్టాలో చెప్పాడు. జీవితాన్ని ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచేదని, ఆమెలాంటి వ్యక్తులు కలలు కనడం నేర్పిస్తారని అన్నాడు. జీవితంలో గెలుపు ఓటములు సహజమని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించామా లేదా అన్నదే ముఖ్యమని సిట్సిపాస్ అభిప్రాయపడ్డాడు. ట్రోఫీలు గెలుచుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడం జీవితంలో ఓ భాగం తప్ప అదే జీవితం కాదని అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

