హైదరాబాద్, ఆట ప్రతినిధి: పారా అథ్లెట్లు సాధించే విజయాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. దుబాయ్ వేదికగా జరిగిన 14వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ అథ్లెట్ మోహనహర్ష రజత పతకంతో మెరిశాడు. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో మోహనహర్షను సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అభినందించారు. పారా అథ్లెటిక్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న మోహన్ భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. హర్షను తీర్చిదిద్దుతున్న జాతీ య అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్‌ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్, కోచ్ లక్ష్మణ్ పాల్గొన్నారు.