SL vs BAN | బంగ్లాకు కౌంటర్‌గా.. శ్రీలంక ‘టైమ్డ్ ఔట్’ సెలబ్రేషన్.. వీడియో వైరల్
SL vs BAN : ప్రపంచ క్రికెట్లో కొన్ని జట్ల మధ్య, ఆటగాళ్ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆటగాళ్ల మధ్య కవ్వింపు చర్యలు, స్లెడ్జింగ్ వంటివి అలాంటివే. నిరుడు వన్డే వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్(Aanjelo Mathews) టైమ్డ్ ఔట్‌తో శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య మొదలైన గొడవ...
SL vs BAN : ప్రపంచ క్రికెట్లో కొన్ని జట్ల మధ్య, ఆటగాళ్ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆటగాళ్ల మధ్య కవ్వింపు చర్యలు, స్లెడ్జింగ్ వంటివి అలాంటివే. గత కొన్ని రోజులుగా ‘టైమ్డ్ ఔట్'(Timed Out) వివాదం వార్తల్లో నిలుస్తోంది. నిరుడు వన్డే వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్(Aanjelo Mathews) టైమ్డ్ ఔట్‌తో శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య మొదలైన గొడవ ఇంకా సద్దుమణగలేదు. తాజాగా మూడో టీ20లో బంగ్లాను ఓడించిన లంక.. టైమ్డ్ ఔట్ సిగ్నల్‌తో బదులిచ్చింది.
ఈ మ్యాచ్‌లో లంక పేసర్ నువాన్ తుషార హ్యాట్రిక్ వికెట్లతో బంగ్లాను దెబ్బకొట్టాడు. దాంతో లంక 28 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. అనంతరం కెప్టెన్ వనిందు హసరంగ జట్టు సభ్యులకు ట్రోఫీ అందించాడు. అప్పుడు లంక ఆటగాళ్లంతా టైమ్డ్ ఔట్ గెశ్చర్‌తో బంగ్లాను టీజ్ చేశారు. తమ ఎడమ చేతి మణికట్టుపై కుడిచేతి చూపుడు వేలిని పెట్టి.. ‘టైమ్డ్ ఔట్’ సెలబ్రేషన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Time out celebration 😂 pic.twitter.com/ijFTqhDu1Z
— SRI LANKA CRICKET LIONS (@slcricketlions) March 9, 2024
తొలి టీ20లో బంగ్లా పేసర్ షొరిఫుల్(Shoriful Islam) ఇస్లాం లంక ఓపెనర్ అవిష్క వికెట్ తీసి టైమ్డ్ ఔట్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన లంక ఆటగాళ్లు 2-1తో సిరీస్ గెలిచిన అనంతరం అదే తరహా సెలబ్రేషన్‌తో బంగ్లాకు కౌంటర్ ఇచ్చారు. మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో స్పందించాడు. లంక ఆటగాళ్లు ఇంకా టైమ్డ్ ఔట్ వివాదం నుంచి బయటకు రాలేదు. వాళ్లు వర్తమానంలో ఉండాలి అని లంక జట్టుకు శాంటో సూచించాడు.
Shoriful Islam Timed-out Celebration pic.twitter.com/fkPGrIVjei
— SRI LANKA CRICKET LIONS (@slcricketlions) March 4, 2024
తొలి క్రికెటర్‌గా రికార్డు..
వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అయ్యాడు. దాంతో, ఈ విధంగా ఔటైన తొలి క్రికెటర్‌గా అతడు రికార్డు సృష్టించాడు. అసలు ఏం జరిగిందంటే.. షకీబల్ హసన్ వేసిన 25వ ఓవర్లో సమరవిక్రమ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మాథ్యూస్.. హెల్మెట్ సరిగ్గా లేకపోవడాన్ని గుర్తించాడు. వెంటనే డగౌట్లో ఉన్న సహచరులకు సైగ చేసి హెల్మెట్ తీసుకురమ్మన్నాడు.

ఐసీసీ రూల్స్ ప్రకారం కొత్త బ్యాటర్ 2 నిమిషాలలోపే క్రీజులోకి రావాలి. కానీ, మాథ్యూస్ హెల్మెట్ బాగా లేదని ఆగిపోయాడు దాంతో, టైమ్ వేస్టు కావడాన్ని గుర్తించిన బంగ్లా కెప్టెన్ షకీబ్ ‘హౌ ఈజ్ దట్’ అంటూ అప్పీల్ చేశాడు. దీంతో లెగ్ అంపైర్‌తో చర్చించిన అంపైర్ మాథ్యూస్‌తో మాట్లాడాడు. అప్పటికే నిర్ణీత సమయం మించిపోవడం, మాథ్యూ స్ గార్డ్ తీసుకోకపోవడంతో అతడిని ఔట్‌గా ప్రకటించాడు.
ఇవి కూడా చదవండి
- Doctor | మద్యం మత్తు.. బట్టలు తీసేసి దవాఖానలో నగ్నంగా తిరిగిన డాక్టర్
- Swag | రాణి రుక్మిణి దేవిగా రీతూవర్మ.. శ్రీవిష్ణు ‘స్వాగ్’ నయా లుక్ వైరల్
- Road Accident | ఆదిలాబాద్ జిల్లాలో ట్రాక్టర్ బోల్తా : 12 మందికి గాయాలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | యాసిడ్ అమ్మకాలపై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన..!
Shiraz Mehdi | చిన్న సినిమాలకు థియేటర్ల కొరత.. ఫిలిం ఛాంబర్ తీరుపై దర్శకుడు షిరాజ్ మెహదీ ఫైర్!
ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
CM Revant vs Farmers | సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంపై పాడి రైతుల ఆగ్రహం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

