హైదరాబాద్ : ఐలీగ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో శ్రీనిధి దక్కన్ ఆదివారం సుదేవ ఢిల్లీ జట్టుపై 3-1 తేడాతో విజయం సాధించింది. శ్రీనిధి జట్టులో డేవిడ్ కాస్టనెడ మునోజ్ 71ని.లో, ఒగాన లూయిస్ 81, 89 ని.లలో గోల్స్ చేయగా, సుదేవ జట్టులో లాల్బియాక్లియాన 28వ నిమిషంలో గోల్ సాధించాడు. గోవాలో జరిగిన మరో మ్యాచ్‌లో గోకులం కేరళ 1-0తో చర్చిల్ బ్రదర్స్‌పై గెలుపొందింది. ఫర్షాద్ నూర్ 21వ నిమిషంలో ఏకైక గోల్‌ను నమోదు చేశాడు.