హైదరాబాద్, ఆట ప్రతినిధి: హీరో ఐ-లీగ్‌లో శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో శ్రీనిధి 1-0తో డిఫెండింగ్ చాంపియన్ గోకులమ్ కేరళపై ఘనవిజయం సాధించింది. అఫ్గానిస్థాన్ మిడ్‌ఫీల్డర్ ఫైసల్ ఏకైక గోల్‌తో శ్రీనిది ఫుట్‌బాల్ క్లబ్‌కు విజయం అందించాడు. ఈ విజయంతో శ్రీనిది డెక్కన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఇరు జట్ల ఆటగాళ్లు కొదమసింహాల్లా తలపడటంతో తొలి అర్ధభాగంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఆ తర్వాత దాడులను తీవ్రతరం చేసిన శ్రీనిధి టీమ్ ఫైసల్ గోల్‌తో ఫలితం రాబట్టింది. తదుపరి మ్యాచ్‌లో గురువారం మొహమ్మదన్ క్లబ్‌తో శ్రీనిధి తలపడనుంది.