హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దెక్కన్ ఎఫ్‌సీ గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. దెక్కన్ ఎరీనా వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి 4-3 తేడాతో మొహమ్మడన్ స్పోర్టింగ్ క్లబ్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన మొహమ్మడన్ను ఓడించిన శ్రీనిధి వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శ్రీనిధి తరఫున డేవిడ్ కాస్టెండా (70ని, 80ని) డబుల్ గోల్స్‌తో అదరగొట్టగా, ఫైజల్ (43ని), మహమ్మద్ అవాల్ (69ని) చెరో గోల్ నమోదు చేశారు.