Syed Modi International | ఫైనల్లో శ్రీకాంత్.. యువకెరటం తన్వీకి చుక్కెదురు
Syed Modi International : ప్రతిష్ఠాత్మక సయ్యద్ మోడీ ఇంటర్నేషన్ (Syed Modi International)లో కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో సంచలన విజయాలతో వార్తల్లో నిలిచిన యువ షట్లర్ తన్వీ శర్మ (Tanvi Sharma)కు మాత్రం చుక్కెదురైంది.
Syed Modi International : ప్రతిష్ఠాత్మక సయ్యద్ మోడీ ఇంటర్నేషన్ (Syed Modi International)లో కిడాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో భారత్‌కే చెందిన మిథున్ మంజునాథన్ (Mitun Manjunathan)ను ఓడించి టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. ఈ టోర్నీలో సంచలన విజయాలతో వార్తల్లో నిలిచిన యువ షట్లర్ తన్వీ శర్మ (Tanvi Sharma)కు మాత్రం చుక్కెదురైంది. మరో భారత అమ్మాయి ఉన్నాటి హుడా (Unnati Hooda) సైతం సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టింది.
సయ్యద్ మోడీ ఇంటర్నేషన్ సూపర్ 300 టోర్నమెంట్లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది. తొలి రౌండ్ నుంచి చెలరేగి ఆడుతున్న అతడు.. సెమీస్‌లోనూ విజృంభించగా మితున్ మంజునాథన్ చేతులెత్తేశాడు. తొలి సెట్ 21-15తో గెలుపొందిన శ్రీకాంత్‌కు మితున్ గట్టిపోటీనిస్తూ రెండో సెట్ కైవసం చేసుకున్నాడు. కానీ, నిర్ణయాత్మక మూడో సెట్లో మాత్రం మాజీ ఛాంపియన్ ధాటికి మితున్ నిలువలేకపోయాడు. 21-13తో చివరి సెట్ గెలుపొందిన శ్రీకాంత్ టైటిల్ పోరులో తనకంటే తక్కువ ర్యాంకర్ జేసన్ గునవాన్ను ఢీకొట్టనున్నాడు.
🇮🇳 SRIKANTH ENTERS THE FINAL!
Kidambi Srikanth books his spot in the Syed Modi India International 2025 final after a hard-fought all-Indian semifinal against Mithun Manjunath.
Score: 21–15, 19–21, 21–13
A gritty performance from Srikanth as he continues his push for the… pic.twitter.com/RKAHvxu3Wn
— IndiaSportsHub (@IndiaSportsHub) November 29, 2025
ఈ టోర్నీలో నమ్మశక్యంకాని ఆటతో ప్రత్యర్థులకు చెక్ పెట్టిన తన్వీ శర్మ సెమీస్‌లో తడబడింది. క్వార్టర్స్‌లో సిన్ యాన్ హ్యాపీని ఓడించిన తను హీనా హకేచి చేతిలో 17-21, 16-21తో ఓటమి పాలైంది. అతికష్టమ్మీద సెమీస్ బెర్తు సాధించిన ఉన్నాటి.. 15-20, 10-21తో టర్కీ షట్లర్ నెలిషాన్ అర్న్ చేతిలో కంగుతిన్నది. అంతకంటే ముందు జరిగిన మహిళల డబుల్స్ సెమీస్‌లో భారత ద్వయం త్రీసా జాలీ, గాయత్రీ గోపిచంద్ అదరగొట్టింది. మలేషియా జంట ఓంగ్ గ్జిన్ యీ, కర్మెన్ టింగ్‌ను 21-11, 21-15తో మట్టికరిపించింది.
Tanvi Sharma’s brave run ends at Syed Modi International 2025.💔🏸
The 16-year-old Indian lost a tough semifinal battle (21-17, 21-16) against Hina Akechi of Japan.#SyedModiInternational #Badminton #TanviSharma pic.twitter.com/jGRF5JFCbU
— Khel Now (@KhelNow) November 29, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

