సాహో.. శ్రీకాంత్

- ఫైనల్లో కిడాంబి
- లక్ష్యసేన్‌కు కాంస్యం
- ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
ఫామ్‌లో లేడు అన్నవాళ్లకు.. తన స్మాష్ పవర్ చూపుతూ..పనైపోయిందన్న వాళ్లకు.. నెట్ గేమ్‌లోని మజాను పంచుతూ.. ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ శివాలెత్తిన వేళ.. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. 44 ఏండ్ల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత పురుష షట్లర్‌గా రికార్డుల్లోకెక్కిన శ్రీకాంత్.. సెమీస్‌లో భారత్‌కే చెందిన యువ షట్లర్ లక్ష్యసేన్‌పై హోరాహోరీ పోరులో విజయం సాధించాడు. తుదిపోరుకు చేరిన శ్రీకాంత్ తొలి రెండు స్థానాల్లో నిలువడం ఖాయమైపోగా.. సెమీస్‌లో ఓడిన లక్ష్యసేన్ కాంస్యం చేజిక్కించుకున్నాడు. ఒక ప్రపంచ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత్‌కు రెండు పతకాలు దక్కనుండటం ఇదే తొలిసారి!
హుయెల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కిడాంబి శ్రీకాంత్ కొత్త చరిత్ర లిఖించాడు. పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరి ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శనివారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో 12వ సీడ్ శ్రీకాంత్ 17-21, 21-14, 21-17తో భారత్‌కే చెందిన లక్ష్యసేన్‌పై విజయం సాధించాడు. ఈ ఫలితంలో శ్రీకాంత్ ముందంజ వేయగా.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం చేజిక్కించుకున్న మూడో భారత ఆటగాడిగా లక్ష్యసేన్ నిలిచాడు. ప్రకాశ్ పదుకొనె (1983), సాయిప్రణీత్ (2019) ఈ జాబితాలో ముందున్నారు. ఒకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇద్దరు భారత పురుష షట్లర్లకు పతకాలు ఖాయం కావడం ఇదే తొలిసారి కాగా.. శ్రీకాంత్ ఫైనల్‌కు దూసుకెళ్లడంతో భారత్‌కు బంగారు పతకం సాధించే సువర్ణ అవకాశం ఊరిస్తున్నది.
ఆహా ఏమా మ్యాచ్..
గంటా 9 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో ఇరువురు ఆటగాళ్లు తుదికంటా పోరాడగా.. చివరకు అనుభవానిదే పైచేయి అయింది. తొలి గేమ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన 20 ఏండ్ల లక్ష్యసేన్.. శ్రీకాంత్‌కు బలమైన పోటీనిస్తూ ముందుకు సాగాడు. 11-8తో బ్రేక్‌కు వెళ్లిన లక్ష్యసేన్.. అదే జోరులో వరుస పాయింట్లు సాధించాడు. ఒక దశలో 17-17తో స్కోర్లు సమం కాగా.. ఈ దశలో ఒత్తిడికి లోనైన శ్రీకాంత్ ఓ షాట్ నెట్లోకి ఆడటంతో పాటు వరుసగా రెండు షాట్లు ఔట్ కొట్టడంతో గేమ్ పాయింట్‌పై నిలిచిన లక్ష్య.. ఓ సూపర్ స్మాష్‌తో తొలి గేమ్ చేజిక్కించుకున్నాడు. రెండో గేమ్ ఆరంభం నుంచే శ్రీకాంత్ విజృంభించి ఆడాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పవర్ ఫుల్ స్మాష్‌లతో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. ఇరువురు ఆటగాళ్లు కొదమసింహాల్లా తలపడటంతో స్కోర్లు 6-6, 13-13, 16-16తో సమమయ్యాయి. అయితే ఈ దశలో అనుభవాన్ని రంగరించి ప్రత్యర్థిని బోల్తా కొట్టించిన శ్రీకాంత్ వరుస పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
- ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన తొలి భారత పురుష షట్లర్‌గా కిడాంబి శ్రీకాంత్ చరిత్రకెక్కాడు.
- ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన మూడో భారత షట్లర్‌గా లక్ష్యసేన్ నిలిచాడు. ఈ జాబితాలో ప్రకాశ్ పదుకొనె, సాయిప్రణీత్ ముందున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

