హైదరాబాద్: గుజరాత్ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ గేమ్స్‌లో రాష్ట్ర యువ జోడీ ఆకుల శ్రీజ, ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ జోడీ మిక్స్డ్ డబుల్స్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో శ్రీజ, స్నేహిత్ ద్వయం 7-11, 12-10, 8-11, 11-7, 11-8తో ఆకాశ్ పాల్, ప్రాప్తిసేన్(బెంగాల్)పై అద్భుత విజయం సాధించింది. తొలి గేమ్ కోల్పోయినా..పుంజుకున్న శ్రీజ, స్నేహిత్ జంట ప్రత్యర్థికి దీటైన పోటీనిచ్చింది. శనివారం జరిగే ఫైనల్లో గుజరాత్‌కు చెందిన క్రితిక, సిన్హారాయ్ జోడీతో తలపడుతుంది.