Team India: ఇండియా సిరీస్‌తో శ్రీలంకకు లాభాల పంట
క్రికెట్లో ఇండియా( Team India )తో సిరీస్ కోసం ప్రపంచంలోని ఏ బోర్డయినా ఆతృతగా ఎదురు చూస్తుంది. మన టీమ్‌తో ఆడితే వారిపై కాసుల వర్షం కురుస్తుంది మరి. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఇండియాతో ఒక్క సిరీస్ నిర్వహించి.. కోట్లు వెనకేసుకుంది.

కొలంబో: క్రికెట్లో ఇండియా( Team India )తో సిరీస్ కోసం ప్రపంచంలోని ఏ బోర్డయినా ఆతృతగా ఎదురు చూస్తుంది. మన టీమ్‌తో ఆడితే వారిపై కాసుల వర్షం కురుస్తుంది మరి. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఇండియాతో ఒక్క సిరీస్ నిర్వహించి.. కోట్లు వెనకేసుకుంది. నష్టాల్లో కూరుకుపోయిన అక్కడి క్రికెట్ బోర్డు.. ఈ సిరీస్‌తో మళ్లీ లాభాల బాట పట్టింది. బోర్డు సెక్రటరీ మోహన్ డిసిల్వా చెప్పిన దాని ప్రకారం.. ఈ సిరీస్‌తో శ్రీలంక బోర్డుకు రూ.107.7 కోట్లు వచ్చాయి. నిజానికి మొదట కేవలం మూడు వన్డేల సిరీస్ మాత్రమే జరగాల్సింది.
అయితే అక్కడి బోర్డు మన బీసీసీఐని అభ్యర్థించి మరో మూడు టీ20ల సిరీస్ ఆడటానికి ఒప్పించింది. ఇది ఆర్థికంగా అక్కడి బోర్డుకు బాగా కలిసి వచ్చింది. బ్రాడ్‌కాస్టింగ్, ఇతర స్పాన్సర్‌షిప్స్‌తో ఈ భారీ మొత్తం తమకు దక్కినట్లు మోహన్ డిసిల్వా చెప్పారు. ఈ సిరీస్ కోసం వచ్చి, విజయవంతం చేసినందుకు కోచ్ ద్రవిడ్, టీమిండియాకు శ్రీలంక కృతజ్ఞతలు తెలిపింది. ఈ టూర్లో వన్డే సిరీస్ టీమిండియా గెలవగా.. టీ20 సిరీస్‌ను శ్రీలంక గెలిచిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

