హైదరాబాద్, ఆట ప్రతినిధి: శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎస్‌డీఎఫ్‌సీ).. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) డిఫెండర్ ఎలీ సబియా, గోల్‌కీపర్ అల్బినో గోమ్స్‌తో కొత్తగా ఒప్పందం కుదుర్చుకుంది. ఐఎస్ఎల్లో చెన్నై ఎఫ్‌సీ, జంషెడ్పూర్ ఎఫ్‌సీ తరఫున ఇన్ని రోజులు ప్రాతినిధ్యం వహించిన సబియా..ఇక నుంచి ఎస్‌డీఎఫ్‌సీ తరఫున బరిలోకి దిగనున్నాడు. మరోవైపు ముంబై, ఢిల్లీ , ఒడిశా ఎఫ్‌సీ, కేరళ బ్లాస్టర్స్‌కు ఆడిన గోమ్స్.. శ్రీనిధికి సేవలు అందించనున్నాడు.