హైదరాబాద్, ఆట ప్రతినిధి: గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న స్పోర్ట్స్ ఫర్ ఆల్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఏడేండ్ల షాగున్శర్మ ఐదు పసిడి పతకాలతో మెరిసింది. మంగళవారం జరిగిన బాలికల అండర్-8 50మీటర్ల బటర్‌ఫ్లై, 50మీ, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్, ఫ్రీస్టయిల్, 200మీటర్ల ఈవెంట్లలో షాగున్ పసిడి పతకాలు సొంతం చేసుకుంది. నాలుగేండ్ల ప్రాయంలోనే స్విమ్మింగ్ మొదలుపెట్టిన షాగున్ సంచలనాలు సృష్టిస్తున్నది.