మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలోకి పారాచూట్‌తో నిరసనకారుడు.. ఫ్యాన్స్‌కు గాయాలు

మ్యూనిక్: ఓ నిరసనకారుడు తన నిరసనను వినూత్నంగా చెప్పాలని అనుకున్నాడు. కానీ అది కాస్తా చివరికి హింసాత్మకంగా మారింది. పలువురు అభిమానులు గాయపడి, హాస్పిటల్లో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మంగళవారం యూరోకప్‌లో భాగంగా జర్మనీ, ఫ్రాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. పారాచూట్‌తో ఆ నిరసనకారుడు స్టేడియంలోకి రాగానే అక్కడి ఓవర్‌హెడ్ కెమెరా వైర్లకు అది తగిలి అదుపు తప్పింది. దీంతో స్టేడియం పైకప్పు కాస్త దెబ్బతిని ఆ ముక్కలు అభిమానులపై పడ్డాయి. తృటిలో ఫ్రాన్స్ కోచ్ దిదియర్ డెశ్చాంప్స్ తప్పించుకున్నాడు.
ఈ ఘటనను యురోపియన్ సాకర్ తీవ్రంగా పరిగణించింది. సదరు నిరసనకారుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఆయిల్ వాడకాన్ని ఆపేయండి అంటూ ఆ నిరసనకారుడు నినాదాలు చేశాడు. పారచూట్పై గ్రీన్‌పీస్ అని రాసి ఉంది. ఆ నిరసనకారుడు గ్రౌండ్లో దిగగానే జర్మనీ ప్లేయర్స్ ఆంటోనియో రైగర్, రాబిన్ గోసెన్స్ అతని దగ్గరికి వెళ్లారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటకు తీసుకెళ్లారు. ఈ యూరోకప్ స్పాన్సర్‌గా ఉన్న రష్యాకు చెందిన ఇంధన ఉత్పత్తి సంస్థ గాజ్‌ప్రోమ్‌కు వ్యతిరేకంగా గతంలోనూ గ్రీన్‌పీస్ నిరసనలు తెలిపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

