పుణె: సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్కప్(ODI Worldcup) మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. దక్షిణాఫ్రికా జట్టులోకి రబడ వచ్చేశాడు. షంసీ స్థానంలో అతన్ని తీసుకున్నారు. న్యూజిలాండ్ కూడా ఒక మార్పు చేసింది. ఫెర్గూసన్ స్థానంలో సౌథీని తీసుకున్నది. తాజా సమాచారం ప్రకారం దక్షిణాఫ్రికా తొలి వికెట్ను కోల్పోయింది. ఆ జట్టు సారధి బవుమా ఔటయ్యాడు. 24 రన్స్ చేసిన బవుమా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సౌతాఫ్రికా 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 38 రన్స్ చేసింది.