అడిలైడ్: దక్షిణాఫ్రికా యువ ఆటగాడు ఫ్రెజర్ లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ (29 బంతుల్లో) నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును ఫ్రెజర్ తిరగరాశాడు. డివిలియర్స్ అంతర్జాతీయ స్థాయిలో వెస్టిండీస్‌పై 31 బంతుల్లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. లిస్ట్-ఏలో ఫ్రెజర్ నయా రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా దేశవాళీ టోర్నీలో టాస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణ ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఫ్రెజర్ (38 బంతుల్లో 125; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.