మౌంట్‌మాంగనీ: మహిళల వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు హ్యాట్రిక్ కొట్టింది. సోమవారం జరిగిన ఉత్కంఠ భరిత పోరులో దక్షిణాఫ్రికా అమ్మాయిలు 3 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై విజయం సాధించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 235 పరుగులు చేసింది. బ్యూమౌంట్ (62), అమీ జోన్స్ (53) అర్ధశతకాలు నమోదు చేశారు. సఫారీ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మరిజానే 5 వికెట్లతో అల్లాడించింది. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 236 రన్స్ చేసింది. మరో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించింది.