Virender Sehwag: ఇండియాలో ఆ దిగ్గజం తర్వాత నువ్వే వీరూ..! దాదా ప్రశంసలు
Virender Sehwag: సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్లో ఆట తీరునే మార్చాడని.. అతడిది ప్రత్యేకమైన టాలెంట్ అని ప్రశంసించాడు. వీరూకు సోమవారం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కినందుకు గాను అతడిపై ప్రశంసలు కురిపిస్తూ దాదా వీరూకు ఓ లేఖ రాశాడు.
Virender Sehwag: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, సోమవారం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ పొందిన వీరేంద్ర సెహ్వాగ్ పై టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. భారత్‌లో సునీల్ గవాస్కర్ తర్వాత బెస్ట్ ఓపెనింగ్ బ్యాటర్ వీరూనే అని కొనియాడాడు. సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్లో ఆట తీరునే మార్చాడని.. అతడిది ప్రత్యేకమైన టాలెంట్ అని ప్రశంసించాడు. వీరూకు సోమవారం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కినందుకు గాను అతడిపై ప్రశంసలు కురిపిస్తూ దాదా వీరూకు ఓ లేఖ రాశాడు.
లేఖలో గంగూలీ.. ‘టెస్టు క్రికెట్లో బ్యాటింగ్ శైలినే నువ్వు మార్చేశావు. నీలో ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. నాణ్యమైన బౌలర్లు, మెరుగైన పేసర్లను ధీటుగా ఎదుర్కుని నువ్వు అవలీలగా పరుగులు సాధించావు. భారత జట్టులో సునీల్ గవాస్కర్ తర్వాత బెస్ట్ ఓపెనింగ్ బ్యాటర్ నువ్వే. నువ్వు ఫస్ట్ జట్టులోకి వచ్చినప్పుడు నీ వ్యక్తిత్వం గురించి, నీ ఆట గురించి నేను చాలా విన్నాను. నువ్వు మంచి మనిషివే గాక బంతిని ఎంత బలంగొ కొట్టగలవనేది ఇండియా సెలక్టర్లు నాకు చెప్పారు…
నాకు ఇప్పటికీ నిన్ను ఓపెనర్‌గా పంపిన సందర్భం గుర్తుంది. 2002లో లార్డ్స్ టెస్టులో నిన్ను నేను ఓపెనింగ్ చేయమన్నాను. అయితే అప్పటికీ నువ్వు ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రాలేదని సందేహించావు. అయితే ఎవరైనా ఈ ప్రత్యేకమైన స్థానంలోనే బ్యాటింగ్ చేయడానికి పుడతారని నేను అనుకోను. నీ టాలెంట్ వల్లే అది సాధ్యమైంది. తొలుత నువ్వు సందేహించావు కానీ అదే మ్యాచ్‌లో నువ్వు 80 రన్స్ చేశావు. అప్పట్నుంచి నువ్వు క్రమక్రమంగా ఎదిగావు. నువ్వు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ను ఎంజాయ్ చేశావు. వన్డే క్రికెట్లో నువ్వు దూకుడుగా ఆడినా నా వరకైతే నువ్వు టెస్టులలో అత్యుత్తమంగా ఆడావు. ముల్తాన్‌లో నువ్వు చేసిన ట్రిపుల్ సెంచరీ నా ఫేవరేట్ ఇన్నింగ్స్‌లలో ఒకటి. నీలాంటి ఓపెనర్ దొరికినందుకు మాకు నీ తర్వాత వచ్చే బ్యాటర్ల పని ఈజీ అయింది..’ అని పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

