Jayshah on Ganguli | బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ రాజీనామా చేయడం లేదని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి జయ్షా పేర్కొన్నారు. భారత క్రికెట్లోకి ఎంటరై 30 ఏండ్లు పూర్తవుతున్న సందర్బంగా బుధవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన నిగూఢమైన ట్వీట్ వైరలైంది. ఆయన బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని వదంతులు వ్యాపించాయి. తన జీవితంలో నూతన చాప్టర్‌లోకి ఎంటరవుతున్న తనకు అందరి మద్దతు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అని గంగూలీ ట్వీట్ చేశారు.
గంగూలీ ట్వీట్‌పై పలురకాల వదంతులు వ్యాపించాయి. రాజకీయ రంగ ప్రవేశం చేస్తారన్న వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో జయ్షా స్పందిస్తూ బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ వైదొలగడం లేదన్నారు. ఇది పూర్తిగా అసత్యం అని ఓ ప్రకటనలో జయ్షా తెలిపారు. భారత క్రికెట్ ప్రయోజనాల కోసమే తాము పూర్తిగా దృష్టి పెడతామన్నారు. 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎన్నికయ్యారు. ఇంకా 4 నెలలు బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా కొనసాగనున్నారు.