MI vs GG : గుజరాత్ జెయింట్స్(Gujarat Giants)కు తొలి ఓవర్ మొదటి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ సోఫీ డంక్లే (Sophia Dunkley)ను నాట్ సీవర్ బ్రంట్ ఎల్బీగా ఔట్ చేసింది. దాంతో, ఖాతా తెరవకుండానే ఆ జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్ క్రీజులో ఉన్నారు.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (51) అర్ధ శతకంతో రాణించింది. ఈ లీగ్‌లో ఆమెకు ఇది మూడో ఫిఫ్టీ. నాలుగో వికెట్‌కు హర్మన్‌ప్రీత్, అమేలియా 29 బంతుల్లో 51 రన్స్ చేశారు. అయితే.. ధాటిగా ఆడుతున్న అమేలియా కేర్ (19)ను ఔట్ చేసిన తనూజ కన్వార్ గుజరాత్‌కు బ్రేక్ ఇచ్చింది.