Smriti Mandhana | ఫిట్‌నెస్‌పై ట్రోలింగ్.. స్మృతి మంధాన స్ట్రాంగ్ కౌంటర్
Smriti Mandhana | భారత మహిళా క్రికెట్ జట్టులో స్టార్ ఓపెనర్‌గా గుర్తింపు పొందిన స్మృతి మంధాన మైదానంలో తన బ్యాటింగ్‌తోనే కాదు, ఆత్మవిశ్వాసంతో కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా తనపై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్‌కు ఆమె ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఫిట్నెస్ను ఎగతాళి చేసిన ట్రోలర్లకు స్మృతి ఎంతో కూల్‌గా సమాధానం ఇచ్చారు.
Smriti Mandhana | భారత మహిళా క్రికెట్ జట్టులో స్టార్ ఓపెనర్‌గా గుర్తింపు పొందిన స్మృతి మంధాన మైదానంలో తన బ్యాటింగ్‌తోనే కాదు, ఆత్మవిశ్వాసంతో కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా తనపై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్‌కు ఆమె ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఫిట్నెస్ను ఎగతాళి చేసిన ట్రోలర్లకు స్మృతి ఎంతో కూల్‌గా సమాధానం ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్మృతి, ఒకసారి స్లీవ్‌లెస్ డ్రెస్‌లో కనిపించినప్పుడు తన చేతులకు కండలు ఉన్నాయని కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని వెల్లడించారు. అయితే ఆ విమర్శలను ఆమె ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. “కండలు ఉండటం తప్పు అన్నట్లుగా ట్రోల్ చేయడం చాలా విచిత్రంగా అనిపించింది. నిజానికి ఒక అథ్లెట్‌గా ఫిట్‌గా ఉండటం, శారీరకంగా దృఢంగా ఉండటం గర్వించాల్సిన విషయం” అని ఆమె స్పష్టం చేశారు.
జిమ్‌లో గంటల కొద్దీ కష్టపడేది అందంగా కనిపించడానికి మాత్రమే కాదని, ఆరోగ్యంగా మరియు బలంగా ఉండటానికేనని స్మృతి పేర్కొన్నారు మనం ఎంత కష్టపడి ఫిట్నెస్ను సంపాదిస్తామో తెలుసు. అలాంటి దానిపై గర్వపడాలి కానీ, ఎవరో చేసే కామెంట్లతో బాధపడకూడదు అని ఆమె తెలిపారు. ముంబైకి చెందిన స్మృతి మంధాన చిన్న వయసులోనే క్రికెట్లోకి అడుగుపెట్టారు. కేవలం 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆమె, అప్పటి నుంచి భారత మహిళా జట్టుకు కీలక సభ్యురాలిగా మారారు. ప్రత్యర్థి ఎవరు అన్నది పట్టించుకోకుండా, తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పడం ఆమె ప్రత్యేకతగా నిలిచింది.
ప్రస్తుతం స్మృతి అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నారు. మహిళా క్రికెట్లో అతి పిన్న వయసులో 7,000 అంతర్జాతీయ పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం మెగ్ లానింగ్ పేరిట ఉంది. 29 ఏళ్ల 13 రోజుల వయసులో లానింగ్ ఈ ఘనత సాధించగా, ఇప్పుడు స్మృతి ఆ రికార్డును అధిగమించే దిశగా దూసుకుపోతున్నారు. క్రికెట్లో వరుస విజయాలతో పాటు, తన ఆలోచనలతో కూడా యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు స్మృతి మంధాన. బాహ్య సౌందర్యం కంటే శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసమే ముఖ్యమని ఆమె మరోసారి నిరూపించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

