డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆరో రోజు రిజర్వ్ డే.. ఎందుకంటే

సౌతాంప్టన్ : మరికొన్ని గంటల్లో భారత్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభంకానున్నది. సౌతాంప్టన్‌లోని ఏజియల్ బౌల్ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్‌కు అంతా సన్నద్దమైంది. నిజానికి ఈ ఫైనల్ మ్యాచ్.. లార్డ్స్ మైదానంలో జరగాల్సి ఉంది. కానీ మహమ్మారి కరోనా వల్ల వేదికను సౌతాంప్టన్‌కు మార్చారు. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత టెస్ట్ చాంపియన్‌షిప్ చివరి మజిలీకి చేరింది. 2019లో ఈ చాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. 9 జట్లతో కూడిన పాయింట్స్ టేబుల్లో భారత్, కివీస్‌లు టాప్‌లో నిలిచాయి. కోహ్లీ సేన తొలి స్థానంలో నిలువగా.. కివీస్ రెండో స్థానంలో నిలిచింది.
సౌతాంప్టన్ స్టేడియంలోకి ప్రతి రోజు 3200 మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఇప్పటికే మొదటి నాలుగు రోజుల కోసం టికెట్లు అన్నీ అమ్ముడుపోయాయి. అయితే బుధవారం రోజును రిజర్వ్ డేగా ప్రకటించారు. ఒకవేళ అయిదు రోజులు జరిగే టెస్ట్ మ్యాచ్‌లో ఏమైనా టైమ్‌ను కోల్పోతే అప్పుడు రిజర్వ్ డే రోజున మ్యాచ్‌ను నిర్వహిస్తారు. కేవలం అయిదు రోజుల్లో కోల్పోయిన సమయం కోసం మాత్రమే ఆరవ రోజును వినియోగించనున్నారు. ఒకవేళ అయిదు రోజులు పూర్తి మ్యాచ్ జరిగితే, అప్పుడు రిజర్వ్ డేతో పని ఉండదు. మ్యాచ్ డ్రా అయితే.. 1.7 మిలియన్ల పౌండ్ల ప్రైజ్‌మనీ ఇరు జట్లకు అప్పగిస్తారు. టెస్ట్ మేస్తో పాటు ట్రోఫీని అందజేస్తారు. సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

