సహాయ కోచ్ కటిచ్ రాజీనామా?
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలంలో వింత పోకడలతో అభిమానులను ఆశ్చర్యపరిచిన సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మరోసారి వార్తల్లోకెక్కింది. వేలంలో జట్టు యాజమాన్యం వ్యవహరించిన తీరుతో అసంతృప్తి చెందిన అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆటగాళ్ల ఎంపిక.. వారికి కేటాయించిన ధరల విషయంలో ఫ్రాంచైజీతో పొరపొచ్చుల కారణంగానే కటిచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా.. అతడి రాజీనామాను ఫ్రాంచైజీ యాజమాన్యం ఆమోదించిందనే వార్తలు వినిపిస్తున్నాయి.