నందినికి రజతం

60వ జాతీయ ఇంటర్‌స్టేట్ సీనియర్ చాంపియన్‌షిప్
పటియాల: టోక్యో ఒలింపిక్స్‌కు ఆఖరి అర్హత టోర్నీ అయిన 60వ జాతీయ ఇంటర్‌స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ స్ప్రింటర్ అగసర నందిని రజత పతకంతో మెరిసింది. శుక్రవారం మహిళల 100మీటర్ల హార్డిల్స్ రేసులో నందిని 13.70 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. కనిమొళి(తమిళనాడు, 13.66సె), సుగంధి(శ్రీలంక, 13.90సె) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. పతకం సాధించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థి నందినిని అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ అభినందించారు. మహిళల 4X 100 మీటర్ల రిలేలో తెలంగాణ జట్టు తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. నందిని, దీప్తి, నిత్య, దేవితో కూడిన తెలంగాణ టీమ్ హీట్-2లో మూడో స్థానంలో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- nandini
- silver medal
- sprinter
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

