Sikandar Raza: జింబాబ్వే సారథికి షాకిచ్చిన ఐసీసీ.. రెండు మ్యాచ్‌ల నిషేధం..
Sikandar Raza: రెండ్రోజుల క్రితం హరారే వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రజా.. ఐర్లాండ్ ఆటగాళ్లతో గొడవ పడ్డందుకు గాను మ్యాచ్ ఫీజులో కోతతో పాటు..
Sikandar Raza: జింబాబ్వే క్రికెట్ జట్టు సారథి సికందర్ రజాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. నిబంధనలకు అతిక్రమించినందుకు గాను రజాపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తూ ఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. రెండ్రోజుల క్రితం హరారే వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రజా.. ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్‌తో పాటు కర్టిస్ కాంఫర్లతో గొడవ పడ్డందుకు గాను మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతతో పాటు రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కున్నాడు. దీంతో అతడు ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు.
వివరాల్లోకెళ్తే.. ఈ నెల 7న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రజా తన ప్రత్యర్థి ఆటగాళ్లపై దురుసుగా ప్రవర్తించాడు. జోషువా లిటిల్‌తో వాగ్వాదానికి దిగిన జింబాబ్వే సారథి.. కాంఫర్ను బ్యాట్ చూపించి బెదిరించడమే గాక అతడిపై దాడి చేయడానికి యత్నించాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ కెమెరాలో రికార్డు కావడంతో ఐసీసీ అతడిపై చర్యలకు దిగింది.
Raza vs Little & Campher#ZIMvsIRE pic.twitter.com/J57tCgQC4W
— Fantasy Cricket Pro 🏏 (Viren Hemrajani) (@FantasycricPro) December 7, 2023
ఐసీసీ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ రజాపై రెండు మ్యాచ్‌ల నిషేధం, మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. దీంతో అతడికి నాలుగు డీమెరిట్ పాయింట్స్ వచ్చాయి. రజాతో వాగ్వాదానికి దిగిన జోషువా లిటిల్, కాంఫర్లను ఐసీసీ మందలించింది. వాళ్ల మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. రజా దూరమవడంతో శనివారం హరారే వేదికగా జరుగుతున్న రెండో టీ20లో జింబాబ్వేను సీన్ విలియమ్స్ నడిపిస్తున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే ఐర్లాండ్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే.. ఆఖరి బంతికి చేధించి ఉత్కంఠ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రజా బౌలింగ్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ 65 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

