ICC Rankings | ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానానికి జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా..!
ICC Rankings | హరారే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచుల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రజా తొలి మ్యాచ్‌లో 87 బంతుల్లో 92 పరుగులు చేశాడు.
ICC Rankings | హరారే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచుల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రజా తొలి మ్యాచ్‌లో 87 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఆ తర్వాత జింబాబ్వే రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికీ అజేయంగా 59 పరుగులు చేశాడు. దాంతో వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్‌లను అధిగమించాడు. 39 ఏళ్ల ఈ బ్యాట్స్‌మెన్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొమ్మిది స్థానాలు ఎగబాకి 22వ స్థానానికి చేరుకున్నాడు.
జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో 2-0 తేడాతో విజయం సాధించడంతో శ్రీలంక ఆటగాళ్లు తాజా ర్యాంకింగ్స్‌లో తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. రెండు మ్యాచ్‌ల్లో 122, 76 పరుగులు సాధించిన పాతుమ్ నిస్సాంక 13వ స్థానానికి చేరాడు. జనిత్ లియానేజ్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 29వ స్థానానికి ఎగబాకాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పేసర్లు అసిత ఫెర్నాండో ఆరు స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి, దిల్షాన్ మధుశంక ఎనిమిది స్థానాలు ఎగబాకి 52వ స్థానానికి చేరాడు. ఇదే సమయంలో మూడు మ్యాచుల సిరీస్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టి బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. 690 పాయింట్లు కేశవ్ మహరాజ్ ఖాతాలో ఉన్నాయి.
రెండోస్థానంలో శ్రీలంక బౌలర్ మహీష్ తీక్షణ ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ లుంగి ఎన్గిడి ఐదు స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకోగా.. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 19వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్ రౌండర్ల వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోల్పోయిన నబీ.. టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న ఆల్‌రౌండర్ హార్దిక్ ప్యాండా తర్వాతి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న యూఏఈ ముక్కోణపు సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసిన తర్వాత రెండోస్థానానికి చేరుకున్నాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ 20వ స్థానానికి, టీ20 ఫార్మాట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌కు చెందిన సుఫియాన్ ముఖీమ్ 22వ స్థానానికి చేరాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

