భారత్ ఆల్‌రౌండ్ షో.. టీమ్ఇండియాకు రెండో విజయం
జింబాబ్వే పర్యటనలో యువ భారత్ జోరు కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఓడినా తర్వాత అనూహ్యంగా పుంజుకున్న టీమ్ఇండియా.. హరారే వేదికగా ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించి వరుసగా రెండో విజయాన్ని కైవసం చేసుకుంది.
జింబాబ్వే పర్యటనలో యువ భారత్ జోరు కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఓడినా తర్వాత అనూహ్యంగా పుంజుకున్న టీమ్ఇండియా.. హరారే వేదికగా ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించి వరుసగా రెండో విజయాన్ని కైవసం చేసుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అర్ధసెంచరీతో రాణించగా రుతురాజ్ గైక్వాడ్ తృటిలో ఫిఫ్టీ మిస్ అయ్యాడు. బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్ రాణించడంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1తో ముందంజ వేసింది.
హరారే: యువ భారత్ మరోసారి అదరగొట్టింది. జింబాబ్వే పర్యటనలో ఉన్న కుర్రాళ్లు ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థిపై 23 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ (49 బంతుల్లో 66, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వీ జైస్వాల్ (27 బంతుల్లో 36, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులకు పరిమితమైంది. డియోన్ మేయర్స్ (49 బంతుల్లో 65 నాటౌట్, 7 ఫోర్లు, 1 సిక్స్), ైక్లెవ్ మడాండే (26 బంతుల్లో 37, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆ జట్టును ఆదుకున్నారు. ఛేదనలో జింబాబ్వేను కట్టడి చేసిన వాషింగ్టన్ సుందర్ (3/15)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఆది నుంచే దంచుడు : తుది జట్టులో 4 మార్పులతో బరిలోకి దిగిన భారత్ ఈ మ్యాచ్‌లో ఏకంగా నలుగురు ఓపెనర్లతో బరిలోకి దిగింది. గిల్‌కు జతగా జైస్వాల్ రాకతో అభిషేక్ శర్మ మూడో స్థానానికి వెళ్లగా రుతురాజ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ నలుగురూ ఐపీఎల్లో ఓపెనర్లే కావడం గమనార్హం. తొలి ఓవర్లోనే జైస్వాల్ 4, 4, 6 బాదగా రెండో ఓవర్లో గిల్ సైతం 4, 6, 4తో ఇన్నింగ్స్‌ను వేగంగా మొదలుపెట్టాడు. 5 ఓవర్లకే 54 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాత నెమ్మదించింది. జింబాబ్వే సారథి సికందర్ రజా వేసిన 9వ ఓవర్లో మొదటి బంతిని రివర్స్ స్వీప్ చేయబోయిన జైస్వాల్ పాయింట్ వద్ద బెన్నెట్‌కు చిక్కాడు. గత మ్యాచ్‌లో శతకగర్జన చేసిన అభిషేక్ (10) ఈ మ్యాచ్‌లో ఆ మ్యాజిక్‌ను కొనసాగించలేకపోయాడు. ఈ క్రమంలో రుతురాజ్‌తో జతకలిసిన గిల్ భారత స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. చటారా 13వ ఓవర్లో మూడో బంతిని బౌండరీకి తరలించి అర్ధ సెంచరీ పూర్తిచేసిన గిల్ ఆ తర్వాత గేర్ మార్చాడు. గైక్వాడ్ సైతం ధాటిగా ఆడాడు. మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించిన ఈ జోడీని 17వ ఓవర్లో ముజరబని విడదీశాడు. గిల్ నిష్క్రమించాక ఎంగ్వారా 19వ ఓవర్లో రెండు ఓవర్లో 6, 4 బాదిన గైక్వాడ్ వ్యక్తిగత స్కోరు 49 పరుగుల వద్ద భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు.
ఆ ఇద్దరు తప్ప..: భారీ ఛేదనలో జింబాబ్వేకు ఆదిలోనే భారీ షాకులు తాకాయి. అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్ ధాటికి జింబాబ్వే 7 ఓవర్లకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టాపార్డర్ విఫలమైనా మేయర్స్, మడాండే భారత బౌలర్లకు అడ్డునిలిచారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. అయితే ఖలీల్ అహ్మద్ (1/15), సుందర్ కట్టడి చేయడంతో జింబాబ్వే వేగంగా పరుగులు సాధించలేకపోయింది. ఆఖర్లో మసకద్జ (18 నాటౌట్) మెరుపులు ఆ జట్టును గెలిపించలేకపోయాయి.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 182/4 (గిల్ 66, రుతురాజ్ 49, రజా 2/24, ముజరబని 2/25).
జింబాబ్వే: 20 ఓవర్లలో 159/6 (మేయర్స్ 65 నాటౌట్, మడాండే 37, సుందర్ 3/15, అవేశ్ 2/39)
2 టీ20లలో భారత్‌పై
150+ స్కోరు చేయడం జింబాబ్వేకు ఇది రెండోసారి మాత్రమే. 2016లో ఒకసారి 170/6 చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

