చెన్నై: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత్‌కు చేదువార్త. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దంచికొడుతూ.. ఫుల్ ఫామ్‌లో ఉన్న టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా కనిపిస్తున్నది.
మెగాటోర్నీలో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో రోహిత్‌సేన అమీతుమీ తేల్చుకోనుండగా.. ప్రస్తుతం గిల్ డెంగ్యూతో బాధపడుతున్నట్లు భారత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ఇంకా సమయం ఉండటంతో ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని వెల్లడించాడు.