యువ షూటర్ ఆత్మహత్య

న్యూఢిల్లీ: ఒత్తిడిని తట్టుకోలేక జాతీయ స్థాయి షూటర్ కొనికా లాయక్ (26) ఆత్మహత్య చేసుకుంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన కొనికా.. కోల్‌కతాలోని ఓ హాస్టల్లో ఉంటూ రైఫిల్ శిక్షణ కొనసాగిస్తున్నది. ఇటీవలి కాలంలో సరైన ప్రదర్శన చేయలేక ఒత్తిడిలో ఉన్న కొనికా.. బుధవారం తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రముఖ నటుడు సోనూసూద్ ఆమెకు రైఫిల్ బహుమతిగా అందించాడు. ఇటీవలి కాలంలో ఇది నాలుగో సంఘటన కావడం షూటింగ్ ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తుండగా.. యువ షూటర్లకు సాయం చేయాలని ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా గురువారం జాతీయ రైఫిల్ సమాఖ్య (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు రణిందర్ సింగ్‌కు లేఖ రాశాడు. యువ షూటర్లలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి తనకు అనుమతివ్వాలని అందులో కోరాడు. కాగా.. ఈ నెలారంభంలో ముగిసిన 64వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాననే ఒత్తిడిలో యువ పిస్టల్ షూటర్ ఖుష్ప్రీత్ కౌర్ సంధు ఆత్మహత్య చేసుకోగా.. హునార్దీప్ సింగ్ సోహల్, నమన్వీర్ సింగ్ వేర్వేరు కారణాలతో ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డారు.
సోనూసూద్ సహకారంతో..
కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ.. అందరి మన్ననలు పొందిన బహుభాషా నటుడు సోనూ సూద్.. కొనికా లాయక్‌కు ఇటీవలే కొత్త రైఫిల్ అందించాడు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె పరిస్థితి తెలుసుకున్న సోనూ సూద్.. జర్మనీలో తయారు చేసిన రైఫిల్‌ను ఆమెకు అందించాడు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన కొనికా ‘సోనూ సర్.. రైఫిల్ అందింది. ఇది నా కుటుంబంతో పాటు మా గ్రామస్థులందరిని ఆనందంలో ముంచెత్తింది. వాళ్లందరి దీవెనలు మీకు ఉంటాయి’అని ట్వీట్ చేసింది. జాతీయ స్థాయిలో చక్కటి ప్రదర్శన కనబర్చిన కొనికా.. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదుగుతుందనుకుంటే ఇలాంటి అనూహ్య నిర్ణయంతో కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

