రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్పై వెటరన్ పేసర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు డుప్లెసిస్ కెప్టెన్సీలో ప్రత్యేకత ఏమీ కనిపించడం లేదని, కెప్టెన్గా అతనికి తాను అభిమానిని కాదని చెప్పేశాడు. అదే సమయంలో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ‘‘దురదృష్ట కెప్టెన్’’గా అభివర్ణించాడు.
‘‘భారత జట్టుకు, అదే విధంగా ఆర్సీబీకి కెప్టెన్గా కోహ్లీ అత్యుత్తమ సేవలందించాడు. తను చేయగలిగినంతా చేశాడు. దురదృష్టం.. అతనికి రెండూ పెద్దగా కలిసి రాలేదు’’ అని చెప్పాడు. అదే సమయంలో కోహ్లీ తర్వాత పగ్గాలు అందుకున్న డుప్లెసిస్.. తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
‘‘కెప్టెన్సీ చేసే సమయంలో ముఖ్యమైన సమయాల్లో డుప్లెసిస్ అంత తెలివిగా కనిపించడం లేదు. ఒక పెద్ద ఫ్రాంచైజీకి కెప్టెన్ అయ్యే అవకాశం అతనికి లభించింది. మరి వాళ్ల అదృష్టాన్ని అతనైనా మారుస్తాడేమో చూడాలి. అది జరిగితే చాలా మంచిది. కానీ నాకు అంత నమ్మకం లేదు’’ అని చెప్పేశాడు.