DC vs UPW : ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ షఫాలీ వర్మ (17) ఔట్ అయింది. మెక్‌గ్రాత్ ఓవర్లో షఫాలీ ఇచ్చిన క్యాచ్‌ను కిరణ్ నవ్‌గిరే అందుకుంది. దాంతో, 67 పరుగుల వద్ద ఢిల్లీ మొదటి వికెట్ పడింది. మేగ్ లానింగ్ (46), మరిజానే కాప్ (8 క్రీజులో ఉన్నారు. రాజేశ్వరి గైక్వాడ్ వేసిన ఆరో ఓవర్లో షఫాలీ ఒక ఫోర్, లానింగ్ 3 బౌండరీలు కొట్టింది. ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 79 రన్స్ చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ ఆరో మ్యాచ్‌లో యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన యూపీ ఫీల్డింగ్ తీసుకుంది. గత మ్యాచ్‌లో విరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన గ్రేస్ హ్యారిస్‌ను యూపీ పక్కనపెట్టింది. ఆమె ప్లేస్‌లో షబ్నం ఇస్మాయిల్‌ను తీసుకుంది.