Rohit Sharma | రోహిత్ శర్మకు అసలు దయే లేదు.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అతడికే: వాట్సన్
Rohit Sharma | ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు గేర్లు మార్చగల హిట్‌మ్యాన్‌ను వీలైనంత త్వరగా వెనక్కి పంపకపోతే.. అవతలి జట్టు గెలుపుపై ఆశలు వదులు కోవాల్సిందే అని వాట్సన్ వెల్లడించాడు. ప్రస్తుతం రోహిత్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని.. పవర్ హిట్టింగ్తో మ్యాచ్‌లను సులువు చేస్తున్నాడని వాట్సన్ అభిప్రాయపడ్డాడు.
Rohit Sharma | టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజా ప్రపంచకప్‌లో రోహిత్.. ప్రత్యర్థులపై కనీసం దయ లేకుండా విరుచుకుపడుతున్నాడని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు గేర్లు మార్చగల హిట్‌మ్యాన్‌ను వీలైనంత త్వరగా వెనక్కి పంపకపోతే.. అవతలి జట్టు గెలుపుపై ఆశలు వదులు కోవాల్సిందే అని వాట్సన్ వెల్లడించాడు. ప్రస్తుతం రోహిత్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని.. పవర్ హిట్టింగ్తో మ్యాచ్‌లను సులువు చేస్తున్నాడని వాట్సన్ అభిప్రాయపడ్డాడు.
వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ప్లేయర్లు దంచికొడుతున్నా.. అత్యధిక పరుగుల జాబితాలో రోహిత్ కన్నా విరాట్ ముందంజలో నిలిచినా.. మెగాటోర్నీ ముగిసేసరికి రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలువడం ఖాయమని వాట్సన్ జోస్యం చెప్పాడు. వరల్డ్‌కప్‌లో ఒత్తిడిని తట్టుకుంటూ జట్టును ముందుకు నడుపుతున్న రోహిత్.. అటు ప్లేయర్‌గానూ తన ముద్ర చాటుకుంటున్నాడని.. ఈ జోరు ఇలాగే కొనసాగితే.. అతడికే అవార్డు దక్కడం ఖాయం అని వాట్సన్ అన్నాడు. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల్లో ఓ సెంచరీ చేసిన రోహిత్ 311 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో విరాట్ కంటే కాస్త వెనక ఉన్నాడు.
భారత్‌దే వరల్డ్‌కప్: షోయబ్ అక్తర్
సవ్దేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా విజేతగా నిలువకపోతే ఆశ్చర్యమే అని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న రోహిత్ సేనను ఆపే జట్టు మరొకటి లేదని అక్తర్ పేర్కొన్నాడు. ‘బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మైదానంలో అన్నీ రంగాల్లో సమతూకంగా ఉన్న భారత జట్టు.. ఈసారి విశ్వ విజేతగా నిలువకపోతే నేను ఆశ్చర్యపోతా’ అని అక్తర్ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన రోహిత్ సేన.. ఆదివారం ఇంగ్లండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

